AP Govt: దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఏపీ మంత్రుల పర్యటన

AP Ministers visit south korea
  • దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పర్యటిస్తున్న ఏపీ మంత్రులు నారాయణ, బీసీ జనార్థన్ రెడ్డి
  • హన్ నది తీర అభివృద్ధిని పరిశీలించిన ఏపీ మంత్రుల బృందం
  • ఐల్యాండ్ అభివృద్ధిపై చర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అమరావతిలోని కృష్ణా నది తీరాన్ని అభివృద్ధి చేసేందుకు నడుం బిగించింది. ఈ క్రమంలో భాగంగా, ఒక ప్రభుత్వ బృందం దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలో గల హన్ నది తీర ప్రాంతాన్ని ఆదివారం నాడు సందర్శించింది. మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి ఈ బృందానికి నేతృత్వం వహించారు.

హన్ నది తీర అభివృద్ధి – అమరావతికి ఆదర్శం

సియోల్ నగరంలోని హన్ నది తీరాన్ని పార్కులు, వంతెనలు, సైకిల్ మార్గాలు, పర్యాటక సదుపాయాలతో తీర్చిదిద్దిన తీరు అమరావతిలో కృష్ణా నది తీర అభివృద్ధికి మార్గదర్శకంగా ఉంటుందని మంత్రులు అభిప్రాయపడ్డారు.

ఆర్థికాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ పర్యటన కొనసాగుతోంది. రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి టి. కృష్ణబాబు, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, సీఆర్‌డీఏ కమిషనర్‌ కన్నబాబు కూడా ఈ బృందంలో ఉన్నారు.

ఐల్యాండ్ అభివృద్ధిపై చర్చ

సియోల్‌లోని ప్రసిద్ధ నామీ ఐ ల్యాండ్‌ సీఈవో మిన్ క్యోంగ్ పూతో భారత బృందం సమావేశమైంది. అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు, ఏడాది పొడవునా జరిగే సంగీత ఉత్సవాలు, ద్వీపం అభివృద్ధి వంటి అంశాలపై వారు చర్చించారు. అలాంటి నమూనాలను అమరావతిలో అమలు చేయవచ్చా అనే దానిపై అధ్యయనం చేస్తున్నారు.

కాలుష్యంపై విజయవంతమైన చర్యలపై అవగాహన

ఏపీ మంత్రులు చియాంగ్ గేచెఒన్ వాగు అభివృద్ధిని పరిశీలించారు. 30 ఏళ్ల క్రితం మురుగు నీటితో కలుషితమైన ఈ వాగు, ప్రభుత్వ ప్రణాళికలతో పరిశుభ్రతను సంతరించుకుని, ఇప్పుడు నగరానికి అందాన్ని చేకూరుస్తోంది. అక్కడి అధికారులు తీసుకున్న చర్యలపై ఏపీ బృందం అవగాహన పొందింది.

రాయబార కార్యాలయం ఆతిథ్యం

ఈ పర్యటనలో భాగంగా, దక్షిణ కొరియాలోని భారత రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ నిషికాంత్ సింగ్, షాలిని సింగ్ దంపతుల ఆహ్వానంతో మంత్రుల బృందం స్థానిక శరవణ భవన్ రెస్టారెంట్‌ను సందర్శించారు.

అభివృద్ధి దిశగా అధ్యయనం

ఈ పర్యటన ద్వారా పర్యాటకం, నది తీరాభివృద్ధి, వృత్తిపరమైన మ్యూజిక్ ఫెస్టివల్స్, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో ఏపీ బృందం అధ్యయనం చేస్తోంది. దీని ద్వారా అమరావతిలో సమగ్ర అభివృద్ధికి నూతన దిశలు నిర్దేశించవచ్చని అధికారవర్గాలు భావిస్తున్నాయి. 

AP Govt
ap ministers
p narayana
bc janasdhan reddy
south korea

More Telugu News