కరూర్ ర్యాలీలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరం: పవన్ కల్యాణ్

  • తమిళనాడులోని కరూర్ లో నటుడు విజయ్ ర్యాలీలో తొక్కిసలాట
  • 31 మంది దుర్మరణం
  • ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
  • మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉండటం కలచివేసిందన్న పవన్
  • గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి
  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేనాని
తమిళనాడులోని కరూర్ లో నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన అత్యంత దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు.

ఈ ఘటనకు సంబంధించి పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ తొక్కిసలాటలో 31 మంది మరణించారని తెలిసి షాక్‌కు గురయ్యానని తెలిపారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉండటం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ ప్రమాదంలో గాయపడిన వారికి తమిళనాడు ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


More Telugu News