'మిరాయ్' దసరా కానుక.. టిక్కెట్ ధరలు తగ్గిస్తూ కీలక ప్రకటన

  • ఇప్పటి వరకు రూ. 140 కోట్లకు పైగా వసూలు చేసిన మిరాయ్
  • చిత్రాన్ని మరింతగా ప్రేక్షకులకు చేరువ చేసేందుకు నిర్ణయం
  • సింగిల్ స్క్రీన్ టిక్కెట్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం
'మిరాయ్' దసరా కానుకను ప్రకటించింది. దసరా పండుగ సందర్భంగా టిక్కెట్ ధరలను తగ్గిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మిరాయ్'. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటివరకు రూ. 140 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఈ నేపథ్యంలో, ఈ చిత్రాన్ని మరింతగా ప్రేక్షకులకు చేరువ చేసేందుకు చిత్ర బృందం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టిక్కెట్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

"ఈ దసరాను మీ కుటుంబంతో, పిల్లలతో కలిసి 'మిరాయ్' సినిమాను థియేటర్‌లలో చూడండి. సింగిల్ స్క్రీన్‌లలో అతి తక్కువ ధరకే చిత్రాన్ని ఆస్వాదించండి" అని చిత్ర బృందం పేర్కొంది. బాల్కనీ టిక్కెట్ ధరను రూ. 150, ఫస్ట్ క్లాస్ టిక్కెట్ ధరను రూ. 105గా నిర్ణయించారు.


More Telugu News