ఓటీటీకి వచ్చేసిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్!
- కన్నడలో రూపొందిన 'మాదేవా'
- మాస్ యాక్షన్ జోనర్లో నిర్మితమైన సినిమా
- 1980 కాలంలో నడిచే కథ
- నిన్నటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి
కన్నడ నుంచి ఇప్పుడు ఓటీటీ వైపుకు మరో యాక్షన్ థ్రిల్లర్ వచ్చేసింది. ఆ సినిమా పేరే 'మాదేవా'. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన మాస్ యాక్షన్ మూవీ ఇది. వినోద్ ప్రభాకర్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి నవీన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. కేశవ దేవసాంద్ర నిర్మించిన ఈ సినిమాలో కథనాయికగా సోనాల్ నటించింది.
ఈ ఏడాది జూన్ 6వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. 4 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, 10 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. అచ్యుత్ కుమార్ .. మైకో నాగరాజ్ .. శ్రీనగర్ కిట్టి .. శృతి ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీకి వచ్చేసింది. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ కథ 1980 కాలం నాటి నేపథ్యంలో కొనసాగుతుంది. ఉరిశిక్ష పడిన ఒక ఖైదీ చుట్టూ తిరిగే కథ ఇది. కథలో ఎక్కువ భాగం రైలులో .. జైలులో కొనసాగడం కొత్తగా అనిపిస్తుంది. ఇటు ఎమోషన్ .. అటు యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. హింస ఎక్కువగా కనిపించే ఈ సినిమాను, మాస్ యాక్షన్ ను ఇష్టపడేవారు చూడొచ్చు.