రూ.1499 లకే విమాన ప్రయాణం.. ఎలియన్స్ ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్
- రాజమండ్రి టు తిరుపతి సర్వీసు ప్రారంభోత్సవ ఆఫర్
- వచ్చే నెల 2, 4, 6 తేదీలలో మాత్రమే తగ్గింపు ధరలు
- వారంలో మూడు రోజులు విమాన సర్వీసులు
ప్రారంభోత్సవం సందర్భంగా అక్టోబర్ 1న ఉదయం 9:25 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరిన విమానం రాజమహేంద్రవరం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం ఉదయం 10:15 గంటలకు మొదలవుతుంది. అక్టోబర్ 2వ తేదీ నుంచి మాత్రం ఈ విమాన సర్వీసులు మంగళవారం, గురువారం, శనివారం నాడు అందుబాటులో ఉంటాయి. ఉదయం 7:40 కి తిరుపతి నుంచి విమానం బయలుదేరి 9:25 గంటలకు రాజమండ్రిలో ల్యాండవుతుంది. తిరిగి రాజమండ్రి నుంచి 9:50 గంటలకు బయలుదేరి 11:20 గంటలకు తిరుపతిలో ల్యాండవుతుందని తెలిపారు.