Hyderabad Floods: మూసీ ఉద్ధృతికి చాదర్ ఘాట్ లో నీట మునిగిన ఇళ్లు.. వీడియో ఇదిగో!

Hyderabad Floods Houses Submerged in Chaderghat Due to Moosi River Fury
  • ఎగువన కురిసిన వర్షాలతో భారీగా వరద వచ్చి చేరడంతో నిండుకుండలా మారిన మూసీ
  • జలమయంగా మారిన ఎంజీబీఎస్.. ప్రయాణికుల అవస్థలు
  • అంబేడ్కర్‌ బస్తీ సహా నీట మునిగిన పలు కాలనీలు
మూసీ ఉద్ధృతికి హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ సమీపంలో పలు కాలనీలు నీట మునిగాయి. అంబేడ్కర్ బస్తీతో పాటు పలు కాలనీల్లోకి వరద చేరింది. ఎంజీబీఎస్ లోకి వెళ్లే మార్గంలో ఉన్న రెండు వంతెనలు నీట మునిగాయి. ఈ రెండు వంతెనలపై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపేశారు. బస్టాండ్ లోకి వరద నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాల సాయంతో ప్రయాణికులు బస్టాండ్ లో నుంచి బయటపడ్డారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో మూసీ నది పొంగిపొర్లుతోంది.

చాదర్ ఘాట్ సమీపంలో నదికి ఇరువైపులా ఉన్న ఇళ్లు నీట మునిగాయి. మూసీ నీటిమట్టం అంతకంతకు పెరగడంతో పరీవాహక కాలనీల్లో జనాలు అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు వందల మందిని సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత చాదర్‌ఘాట్‌ లోలెవల్‌ వంతెన పైనుంచి ఆరు అడుగుల మేర, మూసారాంబాగ్‌ వంతెనపై నుంచి 10 అడుగుల మేర వరద ప్రవహించింది. ముసారాంబాగ్‌ బ్రిడ్జి వద్ద పురోగతిలో ఉన్న పైవంతెన నిర్మాణ సామగ్రి వరద నీటిలో కొట్టుకుపోయింది.
Hyderabad Floods
Moosi River
Chaderghat
Telangana Floods
Hyderabad Rains
GHMC
DRF
Musarambagh Bridge
Rainfall

More Telugu News