టీమిండియాను ఓడించాలంటే అభిషేక్ బచ్చన్‌ను ఔట్ చేయాలట.. అక్తర్ వ్యాఖ్యపై ట్రోలింగ్!
- లైవ్ టీవీ షోలో నోరు జారిన పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్
- టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మకు బదులు అభిషేక్ బచ్చన్ పేరు ప్రస్తావన
- అక్తర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చమత్కారంగా స్పందించిన బాలీవుడ్ నటుడు
- 'నన్ను ఔట్ చేయడం కూడా పాక్ జట్టు వల్ల కాదు' అంటూ సెటైర్
- ఆసియా కప్ ఫైనల్ నేపథ్యంలో వైరల్ అవుతున్న ఘటన
ఆసియా కప్ ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ తలపడనున్న నేపథ్యంలో 'గేమ్ ఆన్ హై' అనే ఒక లైవ్ క్రికెట్ షోలో షోయబ్ అక్తర్ నోరు జారాడు. టీమిండియాను ఓడించాలంటే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మను త్వరగా ఔట్ చేయాలని చెప్పే క్రమంలో, పొరపాటున ఆయన పేరుకు బదులు "ఒకవేళ పాకిస్థాన్ గనుక అభిషేక్ బచ్చన్‌ను ముందుగానే ఔట్ చేస్తే మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి పెరుగుతుంది" అని వ్యాఖ్యానించాడు.
అక్తర్ నోటి నుంచి ఊహించని విధంగా అభిషేక్ బచ్చన్ పేరు రావడంతో షోలో ఉన్న యాంకర్‌తో పాటు తోటి ప్యానలిస్టులు ఒక్కసారిగా పగలబడి నవ్వారు. వెంటనే తమ తప్పును సరిదిద్దుకుని, అతను చెప్పాలనుకుంది క్రికెటర్ అభిషేక్ శర్మ గురించేనని స్పష్టం చేశారు. అయితే, ఈ సరదా ఘటనకు సంబంధించిన వీడియో క్షణాల్లోనే ఆన్‌లైన్‌లో వైరల్ అయింది.
ఈ వీడియో తన దృష్టికి రావడంతో, తన హాస్యచతురతకు ప్రసిద్ధి చెందిన అభిషేక్ బచ్చన్ ఎక్స్ వేదికగా స్పందించాడు. అక్తర్‌ను ఉద్దేశిస్తూ "సర్, పూర్తి గౌరవంతో చెప్తున్నా, వాళ్లు బహుశా అది కూడా చేయలేరనుకుంటా! పైగా నాకు సరిగా క్రికెట్ ఆడటం కూడా రాదు" అని చమత్కారంగా పోస్ట్ చేశాడు. పాకిస్థాన్ జట్టును ఉద్దేశించి ఆయన చేసిన ఈ వ్యంగ్యాస్త్రానికి నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.
ఈ టోర్నమెంట్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుత ఫామ్‌తో అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 248 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అందుకే, ఫైనల్‌లో అతడిని కట్టడి చేయడం పాకిస్థాన్‌కు అత్యంత కీలకమని అక్తర్ సహా పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫైనల్లో భారత జట్టు చుట్టూ ఉన్న 'హవా'ను బద్దలు కొట్టి, దూకుడుగా ఆడాలని అక్తర్ తన జట్టుకు సూచించారు.