నాపై విశ్వాసంతో అవకాశం కల్పించారు: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత

  • కేసీఆర్, కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన మాగంటి సునీత
  • ప్రజల మద్దతు, ఆశీర్వాదం ఉండాలని ఆశించిన మాగంటి సునీత
  • త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదల
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల బీఆర్ఎస్ అభ్యర్థిగా తనపై విశ్వాసం ఉంచి పార్టీ అవకాశం కల్పించినందుకు మాగంటి సునీత కృతజ్ఞతలు తెలిపారు. తనను అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల మద్దతు, ఆశీర్వాదం తనకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

ఇటీవల మృతి చెందిన మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు బీఆర్ఎస్ టిక్కెట్ కేటాయించింది. కేసీఆర్ నిర్ణయం మేరకు పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించింది. అనారోగ్య కారణాలతో గోపీనాథ్ జూన్ 8న కన్నుమూశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం త్వరలో విడుదల చేయనుంది.


More Telugu News