పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా క్రేజ్.. అభిమానులకు ప్రసాద్ మల్టీప్లెక్స్ 'సరికొత్త' సూచన!
- 'ఓజీ' సినిమా సమయంలో గతంలో కంటే భిన్నమైన అభిమానుల హంగామా చూశామని వెల్లడి
- అభిమానులు తమ టీ-షర్ట్ చించుకొని చిత్రాన్ని ఆస్వాదిస్తున్నారంటూ ప్రసాద్ మల్టీప్లెక్స్ ట్వీట్
- చిత్రాన్ని వీక్షించేందుకు వచ్చేవారు అదనపు టీ-షర్ట్ తెచ్చుకోవాలని సూచన
పవన్ కల్యాణ్ నటించిన 'ఓజీ' చిత్రం చూడటానికి వచ్చే ప్రేక్షకులకు హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ ఒక విజ్ఞప్తి చేసింది. ఈ సినిమాను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులు తమ వెంట అదనంగా ఒక టీ-షర్ట్‌ను తెచ్చుకోవాలని సూచించింది. ఈ మేరకు ప్రసాద్ మల్టీప్లెక్స్ 'ఓజీ' చిత్రానికి వస్తున్న క్రేజ్‌పై చమత్కారంగా స్పందించింది.
ప్రముఖ హీరోల చిత్రాల విడుదలయ్యే రోజున బాక్సాఫీస్ వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది. సినిమా చూసే సమయంలో డైలాగులు, నేపథ్య సంగీతం కంటే అభిమానుల కేరింతలు ఎక్కువగా వినిపిస్తాయి. హీరోల సినిమాలు విడుదలైన రోజున థియేటర్లలో అభిమానులు విజిల్స్ వేస్తూ, కుర్చీలపై కూడా డ్యాన్సులు చేస్తుంటారు.
అయితే, 'ఓజీ' చిత్ర ప్రదర్శింపబడుతున్న సమయంలో అభిమానుల హంగామా మరింత ఎక్కువగా ఉందని ప్రసాద్ మల్టీప్లెక్స్ 'ఎక్స్' వేదికగా పేర్కొంది. కొందరు అభిమానులు తమ టీ-షర్టులను చించుకుని సినిమాను ఆస్వాదించారని, అందుకే ఈసారి 'ఓజీ'ని వీక్షించేందుకు వచ్చే వారు అదనంగా ఒక టీ-షర్ట్‌ను తెచ్చుకోవాలని సూచించింది. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అనుభూతిని పంచుతామని, కానీ మీ దుస్తుల విషయంలో మాత్రం బాధ్యత వహించలేమని చమత్కరించింది.