OG Movie: ‘ఓజీ’ షోలో అపశ్రుతి.. ఇద్దరు అభిమానులకు తీవ్ర గాయాలు

Pawan Kalyan OG Movie mishap Fans injured in theater accident
  • భద్రాచలంలో ‘ఓజీ’ సినిమా ప్రదర్శనలో అపశ్రుతి
  • అభిమానులపై కూలిన భారీ సౌండ్ స్పీకర్
  • ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
  • థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపణలు
  • సామర్థ్యానికి మించి ప్రేక్షకులను అనుమతించారని ఫ్యాన్స్ ఆగ్రహం
  • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమా విడుదల సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. భద్రాచలంలోని ఓ థియేటర్‌లో సినిమా చూస్తున్న అభిమానులపై భారీ సౌండ్ స్పీకర్ విరిగిపడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు.

అస‌లేం జ‌రిగిందంటే..!
భద్రాచలంలోని ఏషియన్ థియేటర్‌లో ‘ఓజీ’ ప్రీమియర్ షో సందర్భంగా ఈ ఘటన జరిగింది. సినిమా ప్రదర్శన సమయంలో అభిమానులు కేకలు వేస్తూ, నృత్యాలు చేస్తూ సందడి చేస్తుండగా, గోడకు బిగించిన స్పీకర్లు ఒక్కసారిగా ఊడి కిందపడ్డాయి. నేరుగా ప్రేక్షకుల మధ్యలో పడటంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన తోటి ప్రేక్షకులు, స్థానికులు వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

ఈ ప్రమాదానికి థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని పలువురు అభిమానులు ఆరోపిస్తున్నారు. థియేటర్ సామర్థ్యానికి మించి దాదాపు 1200 మందిని లోపలికి అనుమతించారని, వారి ప్రాణాలతో చెలగాటమాడారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే స్పీకర్లు కూలిపోయాయని వారు ఆరోపించారు. బాధ్యులైన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు.
OG Movie
Pawan Kalyan
OG release
Bhadrachalam
Theater accident
Sound speakers
Fan injuries
Movie premiere
Asian Theater
Theater safety

More Telugu News