కొంపెల్లి వెంకట్ గౌడ్ కన్నుమూత.. కేసీఆర్ సంతాపం
- ప్రముఖ రచయిత, సాహితీవేత్త కొంపెల్లి వెంకట్ గౌడ్ కన్నుమూత
- తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్న కేసీఆర్
- బహుజన అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని కొనియాడిన కేసీఆర్
తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత, సామాజిక చరిత్రకారుడు కొంపెల్లి వెంకట్ గౌడ్ మరణించారు. ఆయన మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకట్ గౌడ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన సేవలను కొనియాడారు. తెలంగాణ సాహిత్య రంగానికి ఇది పూడ్చలేని లోటని విచారం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వెంకట్ గౌడ్ కీలక పాత్ర పోషించారని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్‌తో కలిసి ఆయన రాసిన ‘వొడువని ముచ్చట’ పుస్తకం, ఉద్యమానికి అవసరమైన రాజకీయ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో ఎంతో దోహదపడిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ రచయితగా ఆయన అందించిన స్ఫూర్తిని మరువలేమని అన్నారు.
అదేవిధంగా, బహుజన వర్గాల అభ్యున్నతికి, బీసీల రాజకీయ చైతన్యానికి వెంకట్ గౌడ్ ఎనలేని కృషి చేశారని కేసీఆర్ ప్రశంసించారు. ముఖ్యంగా సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చి, చారిత్రక వాస్తవాలను రికార్డు చేసిన ఘనత వెంకట్ గౌడ్‌కే దక్కుతుందని ఆయన అన్నారు. తెలంగాణ వాదిగా, సాహితీవేత్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వెంకట్ గౌడ్ కుటుంబ సభ్యులకు, మిత్రులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.