ఏపీకి ఉపరాష్ట్రపతి.. ఘన స్వాగతం పలికిన సీఎం, గవర్నర్
- రెండు రోజుల పర్యటన కోసం విజయవాడకు వచ్చిన ఉపరాష్ట్రపతి
- గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం పలికిన గవర్నర్, సీఎం
- స్వాగతం పలికిన వారిలో మంత్రి నారా లోకేశ్
- పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన రాధాకృష్ణన్
- కనకదుర్గమ్మ దర్శనం, విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొననున్న ఉపరాష్ట్రపతి
విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా ఉన్నారు. అనంతరం ఉపరాష్ట్రపతి పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ స్వాగత కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తన పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముందుగా ఆయన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత పున్నమిఘాట్ వద్ద జరగనున్న ‘విజయవాడ ఉత్సవ్’ వేడుకలకు ఆయన హాజరవుతారు.
