House Mates movie: దెయ్యాల ఇంట్లో దిగితే ఇలాగే ఉంటుంది మరి .. జీ 5లో హారర్ థ్రిల్లర్!

House Mates Movie Update
  • తమిళంలో రూపొందిన 'హౌస్ మేట్స్'
  • ఆగస్టు 1న విడుదలైన సినిమా 
  • ఈ నెల 19 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ 
  • దెయ్యాల చుట్టూ తిరిగే కథ

చాలా తక్కువ బడ్జెట్ లో సినిమా చేయాలనుకునేవారికి వెంటనే గుర్తొచ్చేది హరర్ కామెడీ. బడ్జెట్ తక్కువే అయినా, కంటెంట్ పెర్ఫెక్ట్ గా ఉంటే చాలు, మంచి రెస్పాన్స్ వస్తుంది. వ్యూస్ పరంగా ఈ జోనర్ లోని సినిమాలకి ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. ఎందుకంటే హారర్ కామెడీ సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కువగా చూస్తూ ఉండటమే అందుకు కారణంగా చెప్పుకోవాలి. 

అదే విషయాన్ని మరోసారి నిరూపించిన సినిమాగా 'హౌస్ మేట్స్' కనిపిస్తుంది. ఆగస్టు 1వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 19వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. 5 రోజులలోనే ఈ సినిమా, 50 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ ను దక్కించుకుంది. రాజవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, దర్శన్ .. ఆర్ష చాందిని .. కాళీ వెంకట్ .. వినోదిని ముఖ్యమైన పాత్రలను పోషించారు.      

ఈ సినిమా కథ విషయానికి వస్తే, కార్తీక్ - అనూ కొత్తగా పెళ్లైన జంట. సొంత ఫ్లాట్ తీసుకుని హ్యాపీ లైఫ్ ను మొదలుపెట్టాలని నిర్ణయించుకుంటారు. తమ బడ్జెట్ లో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ను కొనుగోలు చేస్తారు. అయితే ఆ ఇంట్లో దిగిన దగ్గర నుంచి వాళ్లకి చిత్రమైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి.  తమ ఇంట్లో తమతో పాటే దెయ్యాలు కూడా ఉన్నాయనే విషయం అర్థం కావడానికి వాళ్లకి కొంత సమయం పడుతుంది. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? పర్యవసానాలు ఎలా ఉంటాయి? అనేది కథ. 

House Mates movie
House Mates ZEE5
horror thriller Telugu
Darshan movie
Arsha Chandini
Kali Venkat
Rajavel director
Telugu horror comedy movies
OTT Telugu movies

More Telugu News