Gurpatwant Singh Pannun: ప్రధాని మోదీకి ఖలిస్థానీ ఉగ్రవాది బెదిరింపు.. రంగంలోకి దిగిన ఎన్ఐఏ

Gurpatwant Singh Pannun Threatens Modi NIA Investigates
  • జెండా ఎగరేయకుండా మోదీని అడ్డుకుంటే రూ.11 కోట్ల రివార్డు ఇస్తామని ప్రకటన
  • పన్నూన్‌, అతని సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్‌పై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
  • పాకిస్థాన్‌లోని లాహోర్ నుంచి భారత సార్వభౌమత్వానికి సవాల్
స్వాతంత్ర్య దినోత్సవాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగరేయకుండా అడ్డుకుంటే ఏకంగా రూ. 11 కోట్ల రివార్డు ఇస్తామంటూ బహిరంగంగా ప్రకటించిన ఖలిస్థానీ ఉగ్రవాది గుర్‍పత్వంత్ సింగ్ పన్నూన్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కేసు నమోదు చేసింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న పన్నూన్‌తో పాటు, అతను నడుపుతున్న 'సిఖ్స్ ఫర్ జస్టిస్' (ఎస్ఎఫ్జే) సంస్థను కూడా ఈ కేసులో చేర్చారు.

ఆగస్టు 10న పాకిస్థాన్‌లోని లాహోర్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పన్నూన్ ఈ వివాదాస్పద ప్రకటన చేశాడు. అమెరికా నుంచి వీడియో లింక్ ద్వారా మాట్లాడుతూ భారత్‌పై తీవ్ర స్థాయిలో విషం కక్కాడు. పంజాబ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాలను కలుపుకొని ఖలిస్థాన్ ఏర్పాటు చేస్తామంటూ ఓ మ్యాప్‌ను కూడా విడుదల చేశాడు. అతని ప్రసంగం భారత సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసేలా, సిక్కులలో భారత వ్యతిరేక భావాలను రెచ్చగొట్టేలా ఉందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

పన్నూన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం, ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఐఏకు అప్పగించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు బీఎన్ఎస్ సెక్షన్ 61(2) (క్రిమినల్ కుట్ర), చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదు చేశారు.

ఈ నేరం తీవ్రత, దాని వెనుక ఉన్న జాతీయ, అంతర్జాతీయ సంబంధాలు, బృహత్తర కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉన్నందున ఎన్ఐఏ దర్యాప్తు తప్పనిసరి అని హోం శాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అంతేకాకుండా, భారత్‌పై పోరాడేందుకు ఓ 'అమరవీరుల బృందాన్ని' ఏర్పాటు చేసినట్లు ఎస్ఎఫ్జే ప్రకటించిందని కూడా ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు.
Gurpatwant Singh Pannun
Khalistani terrorist
NIA investigation
Sikhs for Justice
SFJ
Narendra Modi threat
Khalistan
Indian sovereignty
UAPA Act
Lahore Press Club

More Telugu News