పవన్ కల్యాణ్ 'ఓజి' కోసం 'మిరాయ్' టీమ్ కీలక నిర్ణయం
- రేపు విడుదల అవుతున్న 'ఓజి'
- గురువారం తమ థియేటర్లను 'ఓజీ'కి కేటాయిస్తున్నట్టు 'మిరాయ్' టీమ్ ప్రకటన
- శుక్రవారం నుంచి యథావిధిగా 'మిరాయ్' సినిమా ప్రదర్శన
'ఓజీ' సినిమా విడుదల రోజున, అంటే గురువారం ఒక్కరోజు 'మిరాయ్' ప్రదర్శిస్తున్న థియేటర్లు అన్నింటినీ 'ఓజీ' కోసం కేటాయిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. పవన్ కల్యాణ్ సినిమాకు భారీ స్థాయిలో విడుదల ఉండేందుకు సహకరించాలనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, మంచి వసూళ్లు రాబడుతున్నప్పటికీ ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
ఆ మరుసటి రోజు, అంటే శుక్రవారం నుంచి యథావిధిగా అన్ని థియేటర్లలో 'మిరాయ్' ప్రదర్శనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. మరికొన్ని గంటల్లో 'ఓజీ' విడుదల కానున్న తరుణంలో 'మిరాయ్' టీమ్ తీసుకున్న ఈ నిర్ణయం చిత్ర పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహించేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.