Gautam Mukunda: ఐఐటీ గ్రాడ్యుయేట్ల కోసం ప్రపంచం పడిచచ్చిపోతుంది.. యేల్ స్కాలర్ గౌతమ్ ముకుంద

IIT Graduates in High Demand Globally Says Gautam Mukunda
  • హెచ్ 1బీ వీసా ఫీజు పెంపు నిర్ణయంతో అమెరికాకే నష్టం
  • మన గ్రాడ్యుయేట్లకు ప్రపంచమంతటా ఫుల్ డిమాండ్
  • ట్రంప్ నిర్ణయంపై అమెరికా వ్యాపారవేత్తల్లో అసంతృప్తి నెలకొందన్న గౌతమ్ ముకుంద
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గ్రాడ్యుయేట్ల కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయని యేల్ స్కాలర్ గౌతమ్ ముకుంద అభిప్రాయపడ్డారు. హెచ్ 1బీ వీసా ఫీజు పెంచడం ద్వారా ఐఐటీ గ్రాడ్యుయేట్లు సహా భారతీయ నిపుణులను అమెరికా దూరం చేసుకుందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా వద్దనుకున్నంత మాత్రాన ఐఐటీ గ్రాడ్యుయేట్లకు వచ్చిన నష్టమేమీ లేదని, ప్రపంచ వ్యాప్తంగా వారికి ఫుల్ డిమాండ్ ఉందని చెప్పారు. ట్రంప్ నిర్ణయం అమెరికాకే నష్టమని ఆయన పేర్కొన్నారు.

వీసా ఫీజు పెంపు నిర్ణయంతో అమెరికాలోని వ్యాపారవేత్తలు అసంతృప్తితో ఉన్నారని, అయితే అధ్యక్షుడికి భయపడి వారంతా మౌనాన్ని ఆశ్రయించారని గౌతమ్ చెప్పారు. భారత్ లోని టాప్ గ్రాడ్యుయేట్లకు వివిధ దేశాలు రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతుంటే ట్రంప్ మాత్రం చేజేతులా కాలదన్నుకుంటున్నారని విమర్శించారు. హెచ్ 1బీ వీసా ఫీజు పెంపు నిర్ణయం అర్థరహితమని గౌతమ్ ముకుంద కొట్టిపారేశారు.
Gautam Mukunda
IIT graduates
H1B visa
Yale scholar
Indian Institute of Technology
US immigration policy
Trump
America
job market
Indian professionals

More Telugu News