ట్రంప్ నోబెల్ ఆశలపై మాక్రాన్ ఏమన్నారంటే..!
- నోబెల్ అందుకోవాలంటే గాజా యుద్ధం ఆపడం ఒక్కటే మార్గమన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు
- ఇజ్రాయెల్ పై ఒత్తిడి చేసి యుద్ధం ఆపేసే శక్తి ట్రంప్ కు మాత్రమే ఉందని వ్యాఖ్య
- గాజాకు ఆయుధాలు సరఫరా చేస్తున్న అమెరికాకే ఆ పని సాధ్యమన్న మాక్రాన్
నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతగా తహతహలాడుతున్నారో ప్రపంచం మొత్తానికి తెలుసు.. అయితే, ఆయన కల సాకారం కావాలంటే ఒకే ఒక్క మార్గం ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ – గాజా యుద్ధాన్ని ఆపగలిగితేనే ట్రంప్ కు నోబెల్ బహుమతి దక్కుతుందన్నారు. ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొనేందుకు న్యూయార్క్ వెళ్లిన మాక్రాన్.. అక్కడ ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇజ్రాయెల్ – గాజా యుద్ధాన్ని ఆపగల శక్తి ఈ ప్రపంచంలో అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ఉందని మాక్రాన్ పేర్కొన్నారు. ఈ విషయంలో తమ ఫ్రాన్స్ తో పాటు ప్రపంచ దేశాలు చేయగలిగేది స్వల్పమేనని చెప్పారు. అమెరికా అందిస్తున్న ఆయుధాలే గాజాను ఇంకా యుద్ధ రంగంలో నిలబెడుతున్నాయని, యుద్ధం ఆపే శక్తి అమెరికాకు మాత్రమే ఉందని చెప్పారు. ఇరు దేశాల మధ్య చర్చలు జరిపి యుద్ధం ఆపేయాలని ట్రంప్ కు సూచించారు. ఈ సందర్భంగా ట్రంప్ ను ఉద్దేశించి ‘మీకు నిజంగా నోబెల్ అందుకోవాలని ఉంటే వెంటనే ఇజ్రాయెల్ – గాజా యుద్ధాన్ని ఆపేయండి. నోబెల్ పొందడానికి మీకున్న ఏకైక మార్గం అదే’ అని మాక్రాన్ వ్యాఖ్యానించారు.