Jr NTR: నొప్పిని భరిస్తూనే కెమెరా ముందుకు.. నిర్మాత కోసం సెట్స్‌లోకి ఎన్టీఆర్

Jr NTR returns to set despite injury for producer
  • యాడ్ షూట్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప గాయాలు
  • కొన్ని వారాలు విశ్రాంతి అవసరమన్న వైద్యులు
  • నిర్మాతకు నష్టం కలగకూడదని షూటింగ్‌లో పాల్గొన్న తారక్
  • ఎన్టీఆర్ నిబద్ధత చూసి ఆశ్చర్యపోయిన యూనిట్ సభ్యులు
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన వృత్తిపట్ల చూపే నిబద్ధత, కమిట్‌మెంట్ ఏ స్థాయిలో ఉంటుందో మరోసారి రుజువైంది. ఇటీవల ఓ కమర్షియల్ యాడ్ చిత్రీకరణలో గాయపడినప్పటికీ, నిర్మాత ఆర్థికంగా నష్టపోకూడదనే సదుద్దేశంతో నొప్పిని భరిస్తూనే మరుసటి రోజే షూటింగ్‌ను పూర్తి చేసి అందరి మన్ననలు పొందారు.

ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో ఓ వాణిజ్య ప్రకటన చిత్రీకరణ జరుగుతుండగా ఎన్టీఆర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. దీనితో వైద్యులు ఆయనను కొన్ని వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. అయితే, తాను కోలుకునే వరకు షూటింగ్ వాయిదా వేస్తే, అప్పటికే భారీగా వేసిన సెట్స్ కారణంగా స్టూడియో అద్దె భారం నిర్మాతపై పడుతుందని ఎన్టీఆర్ భావించారు.

అందుకే, విశ్రాంతిని పక్కనపెట్టి, నొప్పిని ఓర్చుకుంటూనే మరుసటి రోజు సెట్స్‌కు హాజరయ్యారు. ఆయన వృత్తిపట్ల చూపిన ఈ నిబద్ధత చూసి యాడ్ ఫిల్మ్ మేకర్స్‌తో పాటు యూనిట్ సభ్యులంతా ఆశ్చర్యపోయారు. అనుకున్న సమయానికి యాడ్ షూట్‌ను పూర్తి చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ గాయాల నుంచి కోలుకుంటున్నారు. పూర్తి ఫిట్‌నెస్ సాధించిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన తదుపరి చిత్రం కొత్త షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్ పరిశీలనలో ఉంది. దీంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర 2’ కూడా చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
Jr NTR
Jr NTR injury
NTR commitment
NTR ad shoot
NTR professionalism
Prashanth Neel Dragon
Devara 2
Koratala Siva
Tollywood news
Telugu cinema

More Telugu News