Balakrishna: అంకుల్ కాదు, ఓన్లీ బాలయ్య.. అసెంబ్లీలో నవ్వులు పూయించిన నందమూరి హీరో

Nandamuri Balakrishna says only Balakrishna not uncle in Assembly
  • టీడీఎల్పీ కార్యాలయంలో సందడి చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ
  • నన్ను అంకుల్ అనొద్దంటూ ఎమ్మెల్సీకి సరదాగా సూచన
  • బాలయ్యతో ఫొటోల కోసం ఆసక్తి చూపిన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు
  • ఈ నెల 25న పవన్ కల్యాణ్ సినిమాకు శుభాకాంక్షలు
  • డిసెంబరు 5న అఖండ-2 విడుదల అని వెల్లడి
"నన్ను అంకుల్ అని పిలవొద్దు.. బాలయ్య అని మాత్రమే అనండి" అంటూ హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన సరదా వ్యాఖ్యలతో అసెంబ్లీలోని టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయంలో నవ్వులు విరిశాయి. మంగళవారం జరిగిన ఈ ఆసక్తికర సంభాషణ అందరినీ ఆకట్టుకుంది.

వివరాల్లోకి వెళితే.. శాసనసభ సమావేశాల విరామ సమయంలో బాలకృష్ణ టీడీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పలువురు మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. అదే సమయంలో తొలిసారిగా అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, బాలకృష్ణను ఉద్దేశించి "నన్ను ఆశీర్వదించండి అంకుల్" అని కోరారు. దీనికి బాలకృష్ణ వెంటనే నవ్వుతూ.. "నో అంకుల్.. ఓన్లీ బాలయ్య" అని చమత్కరించడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు.

ఈ సరదా సంభాషణ అనంతరం, అక్కడున్న వారు బాలకృష్ణను 'అఖండ-2' సినిమా విడుదల గురించి ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ, "ఈ నెల 25న తమ్ముడు పవన్ కల్యాణ్ సినిమా విడుదలవుతోంది. ఆ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాని తర్వాత మా సినిమా డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వస్తుంది" అని బాలకృష్ణ వెల్లడించారు.

ఇదే క్రమంలో మంత్రి సంధ్యారాణి అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి ప్రచారం కల్పించాలని బాలకృష్ణను కోరారు. ఆమె విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మొత్తానికి, తనదైన శైలిలో బాలకృష్ణ చేసిన సందడితో టీడీఎల్పీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది.
Balakrishna
Balakrishna
Hindupuram MLA
TDP
Assembly
Kavali Grishma
Akhanda 2
Pawan Kalyan
Sadhya Rani
Araku Coffee

More Telugu News