గ్యాస్ సిలిండర్ కూ ఎక్స్ పైరీ గడువు.. ఎలా తెలుసుకోవాలంటే!

––
వంటింట్లో గ్యాస్ సిలిండర్ లేని ఇల్లు ప్రస్తుతం అరుదనే చెప్పొచ్చు. గ్యాస్ వాడకం బాగా పెరిగినప్పటికీ సిలిండర్ గురించిన ఓ ముఖ్యమైన విషయం చాలా మందికి తెలియదు. అదే ఎక్స్ పైరీ డేట్.. దుకాణంలో కొన్న వస్తువులకు ఎక్స్ పైరీ డేట్ చూసి తీసుకుంటాం కానీ గ్యాస్ సిలిండర్ కు కూడా అలాంటి గడువు ఉంటుందని, గడువు ముగిసిన సిలిండర్ వాడడమంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమేనని అతికొద్దిమందికే తెలుసు.

ఈ గడువును ఎలా తెలుసుకోవాలంటే..
సిలిండర్‌ పైభాగంలోని గుండ్రటి హ్యాండిల్‌ కింద ప్లేట్‌ లోపలి వైపున ఓ కోడ్‌ రాసి ఉంటుంది. ఇక్కడున్న ఆంగ్ల అక్షరాలు నెలలను, పక్కనున్న సంఖ్య సంవత్సరాన్ని సూచిస్తాయి. ప్రతి మూడు నెలలకు ఓ అక్షరం చొప్పున 12 నెలలను 4 భాగాలుగా విభజించి, అక్షరాలు కేటాయించారు.

ఏ – జనవరి, ఫిబ్రవరి, మార్చి
బీ – ఏప్రిల్, మే, జూన్‌
సీ – జులై, ఆగస్టు, సెప్టెంబరు
డీ – అక్టోబరు, నవంబరు, డిసెంబరు

ఉదాహరణకు బీ-26 అని రాసి ఉంటే ఆ సిలిండర్‌ గడువు తేదీ 2026వ సంవత్సరం జూన్ వరకూ పనిచేస్తుంది. సిలిండర్‌ తీసుకొనే ముందు ఈ గడువు తేదీని సూచించే కోడ్‌ను గమనించాలి.


More Telugu News