విచారణలో మిథున్ రెడ్డి దాటవేత ధోరణి
- 50కి పైగా ప్రశ్నలు సంధించిన అధికారులు
- ఒక్కదానికీ సరైన జవాబివ్వని వైసీపీ ఎంపీ
- మిథున్ రెడ్డిని రెండోరోజు విచారిస్తున్న సిట్ అధికారులు
రూ.5 కోట్ల మద్యం ముడుపుల సొమ్ము మిథున్‌రెడ్డి కుటుంబీకులకు చెందిన పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్ ఖాతాల్లో జమకావడంపై ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం. అయితే, ఎంపీ మిథున్ రెడ్డి ఏ ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. కాగా, మిథున్ రెడ్డిని అధికారులు రెండోరోజు శనివారం కూడా విచారిస్తున్నారు. విచారణ అనంతరం సాయంత్రం ఆయనను కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు తరలించనున్నట్లు తెలుస్తోంది.