అమెరికాలో నిలిచిన వందలాది విమానాలు.. సాంకేతిక సమస్యే కారణం
- దేశమంతటా 1800 విమానాల రాకపోకలపై ప్రభావం
- 200 విమానాల రద్దు.. పలు రూట్లలో విమానాలు ఆలస్యం
- డాలస్ సహా పలు విమానాశ్రయాలలో ప్రయాణికుల పడిగాపులు
దేశవ్యాప్తంగా మొత్తం 1800 విమానాలపై ఈ ప్రభావం పడిందని, డాలస్ లోనే 200 విమాన సర్వీసులు పూర్తిగా రద్దు కాగా, 500లకు పైగా సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. టెలికాం సేవల్లో ఏర్పడిన సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని వారు వెల్లడించారు. ఈ ఏడాది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) తన కమ్యూనికేషన్ సర్వీసుల్లో అనేక సమస్యలు ఎదుర్కొంది. గురువారం కూడా డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.