ఆర్థిక మాంద్యం అంచున అమెరికా.. మూడీస్ ఆర్థికవేత్త వార్నింగ్
- ట్రంప్ టారీఫ్ లను తప్పుబట్టిన మార్క్ జాండీ
- వలస విధానం, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాల ప్రభావం
- నియామకాలు, పెట్టుబడులు ఆలస్యమవుతున్నాయని వెల్లడి
ఫెడరల్ రిజర్వ్ విషయంలో ట్రంప్ నిర్ణయాల ప్రభావం వ్యాపార రంగంపై భారీగా ఉందని, పెట్టుబడులు మందగించాయని వివరించారు. వీటన్నింటి ఫలితంగా ఆర్థిక వృద్ధి నెమ్మదించడంతో పాటు ద్రవ్యోల్బణం పెరుగుతోందని జాడీ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఆర్థిక మందగమనం లక్షణాలు ఇంకా బయటపడనప్పటికీ నిర్మాణ రంగంతో పాటు ఉత్పాదక రంగంలో సూచనలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వివిధ దేశాలపై ట్రంప్ విధించిన టారీఫ్ ల ప్రభావం అమెరికాలోని వినియోగదారుడిపై ఇంకా పూర్తిస్థాయిలో కనిపించడంలేదని జాడీ తెలిపారు. ఈ సందర్భంగా ఇన్వెస్టర్లను జాడీ హెచ్చరిస్తూ.. ఆర్థిక మాంద్యంలో ఏ స్టాక్ కూడా సురక్షితం కాదని చెప్పారు.