రిస్క్ చేసిన విజయ్ ఆంటోని!

  • కొత్త కాన్సెప్ట్ లను ట్రై చేసే విజయ్ ఆంటోని
  • రేపు విడుదలవుతున్న 'భద్రకాళి'
  • ఆయన కెరియర్లో భారీ బడ్జెట్ చిత్రం
  • ఎంతో టెన్షన్ పడ్డానంటున్న హీరో

విజయ్ ఆంటోని సినిమాలు కొత్తగా ఉంటాయి .. ఆయన సినిమాలలో కొత్త పాయింట్ ఏదో ఉంటుందని అభిమానులు భావిస్తూ ఉంటారు. ఆ నమ్మకాన్ని ఎప్పటికప్పుడు నిలబెట్టుకోవడానికే అతను ప్రయత్నిస్తూ వస్తున్నాడు. అయితే 'బిచ్చగాడు' తరువాత అతను చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. కంటెంట్ బాగుంది .. కాన్సెప్ట్ బాగుంది అనేవాళ్లు ఉన్నారుగానీ, కమర్షియల్ గా మాత్రం అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. 

మొన్న జూన్ లో విజయ్ ఆంటోనీ సొంత బ్యానర్లో వచ్చిన 'మార్గన్' మాత్రం ఫరవాలేదు అనిపించుకుంది.  ఓటీటీలోను ఈ సినిమా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో విజయ్ ఆంటోని నుంచి థియేటర్లకు రావడానికి మరో సినిమా సిద్ధమవుతోంది .. ఆ సినిమా పేరే 'భద్రకాళి'. తమిళంలో 'శక్తి తిరుమగన్' పేరుతో రూపొందిన ఈ సినిమా, రేపు విడుదలవుతోంది. అరుణ్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాను, తెలుగులో సురేశ్ బాబు 300 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ ఆంటోని మాట్లాడిన మాటలు చూస్తే, అతను చాలా రిస్క్ చేశాడనే విషయం మాత్రం అర్థమవుతోంది. తన వెనుక ఎవరూలేరనీ, ప్రతి రూపాయి తనదేనని ఆయన అన్నారు. నిర్మాతగా తన కెరియర్లో అత్యధిక బడ్జెట్ తో నిర్మించిన సినిమా ఇదేనని చెప్పారు. ఈ సినిమా బడ్జెట్ .. లావాదేవీల విషయంలో ఎప్పుడూ లేని ఒత్తిడిని అనుభవించానని అన్నారు. కొత్త కాన్సెప్ట్ లను అందించడానికి గట్టిగా ట్రై చేసే విజయ్ ఆంటోనికి ఈ సినిమాతో హిట్ పడాలనే కోరుకుందాం. 



More Telugu News