Nagababu: ఎమ్మెల్సీగా తొలిసారి మండలి సమావేశాలకు వెళుతూ... పవన్ ను కలిసిన నాగబాబు

Nagababu Met Pawan Kalyan Before First MLC Council Meeting
  • తమ్ముడిని మర్యాదపూర్వకంగా కలిసిన అన్న
  • పలు అంశాలపై నాగబాబుకు పవన్ దిశానిర్దేశం
  • జనసేన కోటాలో ఏకగ్రీవంగా ఎన్నికైన నాగబాబు
  • నేటి నుంచే ఏపీ శాసనసభ, మండలి సమావేశాలు
జనసేన నేత, నూతన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఉప ముఖ్యమంత్రి, తన సోదరుడు పవన్ కల్యాణ్ ను కలిశారు. శాసనమండలి సభ్యుడిగా తొలిసారి సమావేశాలకు హాజరయ్యే ముందు ఆయన పవన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సందర్భంగా, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సమస్యల ప్రస్తావన వంటి పలు అంశాలపై నాగబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

రాష్ట్రంలో ఇటీవల ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమి ఒప్పందంలో భాగంగా జనసేన పార్టీకి ఒక స్థానం దక్కింది. ఆ స్థానానికి పార్టీ తరఫున నాగబాబు పేరును ఖరారు చేయడంతో, ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారి మండలి సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న నాగబాబు, తన తమ్ముడు, డిప్యూటీ సీఎంను కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Nagababu
Pawan Kalyan
Janasena
AP Legislative Council
MLC Meeting
Andhra Pradesh Politics
Konidela Nagababu
Deputy Chief Minister
AP Assembly Sessions
Political Strategy

More Telugu News