Manchu Lakshmi: ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న మాట నిజమే: మంచు లక్ష్మీ ప్రసన్న

Manchu Lakshmi Interview
  • మంచు లక్ష్మి ప్రధాన పాత్రగా 'దక్ష'
  • రేపు విడుదలవుతున్న సినిమా
  • ముంబై లైఫ్ స్టైల్ ఇష్టమని వెల్లడి  
  • తనకి సొంతిల్లు లేదన్న లక్ష్మి

మంచు లక్ష్మి ప్రధానమైన పాత్రను పోషిస్తూ నిర్మించిన సినిమానే 'దక్ష'. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, ఈ నెల 19వ తేదీన థియేటర్లకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో మంచు లక్ష్మి బిజీగా ఉన్నారు. తాజాగా 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "కొంత కాలంగా నేను ముంబైలో ఉంటున్నాను. నాకు సంబంధించిన అన్ని పనులను నేను అక్కడి నుంచే చక్కబెడుతున్నాను" అని చెప్పారు.   

"ముంబై లైఫ్ స్టైల్ నాకు ఇష్టం .. పొద్దున్నే లేచి పనుల  కోసం పరిగెత్తడాన్ని నేను ఇష్టపడతాను. ముంబైకి వెళ్లడానికి మా అందరికీ మార్గదర్శి 'రానా'నే. అక్కడ రానాకి ఇల్లు ఉంది .. చరణ్ కి ఇల్లు ఉంది. మా అందరికంటే ముందుగానే సూర్య అక్కడికి వెళ్లారు. ముంబైలో నేను రెంట్ కి ఉంటున్నాను. అక్కడ తాప్సీ .. రకుల్ కలుస్తూ ఉంటారు. నేను ఎక్కడ ఉన్నప్పటికీ నన్ను చూసి ఇతరులు ధైర్యం తెచ్చుకునేలా ఉంటానే తప్ప, పిరికితనంతో బ్రతకమని చెప్పేలా ఉండను" అని అన్నారు. 

"ఆర్ధిక ఇబ్బందుల కారణంగా నేను ఇల్లు అమ్మకానికి పెట్టినట్టుగా ఒక టాక్ వినిపిస్తోందని అంటున్నారు. అసలు నాకు సొంత ఇల్లే లేదు .. అలాంటప్పుడు ఎలా అమ్మకానికి పెడతాను? ఫిల్మ్ నగర్లో ఉన్నది నాన్న ఇల్లు .. గతంలో నేను అక్కడ ఉన్నాను అంతే. ఆ ఇంటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న మాట నిజమే. అయితే ఇలాంటి ఒక పరిస్థితి నుంచి ఎలా ఎదగాలో నేర్చుకోవాలనే పట్టుదలతోనే ఉన్నాను" అని చెప్పారు. 

Manchu Lakshmi
Manchu Lakshmi Prasanna
DAKSHA movie
Telugu cinema
Medical crime thriller
Mumbai lifestyle
Rana Daggubati
Ram Charan
Financial difficulties
Film Nagar

More Telugu News