Nandyala Flood: ఊరా.. ఏరా.. నంద్యాల జిల్లాలో వరద.. వీడియో ఇదిగో!
––
భారీ వర్షాలకు నంద్యాల జిల్లాలో కుండపోత వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉయ్యాలవాడ మండలం హరివరం గ్రామాన్ని వరద ముంచెత్తింది. గ్రామం మొత్తం ఏరును తలపిస్తోంది. ఇళ్ల మధ్య వరద ఏరులా ప్రవహించడం చూసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు.