కారును ఢీ కొట్టిన టిప్పర్.. నెల్లూరు జిల్లాలో ఏడుగురు దుర్మరణం
––
కారును ఢీకొట్టిన అనంతరం టిప్పర్ కొంత దూరం వరకు కారును ఈడ్చుకెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితో పాటు ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారని విచారం వ్యక్తం చేశారు. టిప్పర్ కింద చిక్కుకోవడంతో కారులోని ప్రయాణికుల శరీరాలు నుజ్జునుజ్జయ్యాయని పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.