బ్లాక్ బస్టర్ తరువాత కనిపించని బ్లాక్ బ్యూటీ!

  • ఐశ్వర్య రాజేశ్ కి నటిగా మంచి క్రేజ్ 
  • ఓటీటీలలో ఆమె సినిమాలకి మంచి డిమాండ్ 
  • 'సంక్రాంతికి వస్తున్నాం'తో దక్కిన తిరుగులేని హిట్ 
  • ప్రస్తుతాం తమిళ ప్రాజెక్టులతో బిజీ
  • త్వరలో కన్నడ తెరపై సందడి 

హీరోయిన్ అంటే గ్లామరస్ గానే ఉండాలి .. పాటలకి ముందే రావాలి .. పాటల్లో మాత్రమే కనిపించాలి అనే రోజులు పోయాయి. ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ నటన ప్రధానమైన పాత్రలను మాత్రమే ఒప్పుకుంటూ వెళుతున్నారు. అలాంటి హీరోయిన్స్ లో సాయిపల్లవి .. నిత్యామీనన్ .. ఆ తరువాత స్థానంలో ఐశ్వర్య రాజేశ్ కనిపిస్తుంది. కోలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతూ, తెలుగు తెరపై చోటు సంపాదించుకున్న కథానాయిక ఆమె.

ఐశ్వర్య రాజేశ్ గతంలో కొన్ని తెలుగు సినిమాలు చేసింది. అయితే తెలుగులో ఆమె నేరుగా చేసిన సినిమాలకంటే కూడా, తమిళం నుంచి ఓటీటీకి వచ్చిన అనువాదాలు ఇక్కడి ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. ఆ జాబితాలో డ్రైవర్ జమున .. గ్రేట్ ఇండియన్ కిచెన్ .. సొపన సుందరి .. ఫర్హానా వంటి సినిమాలు కనిపిస్తాయి. ఈ సినిమాలలోని ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆమె అభిమానులుగా మారిపోయారు. 

అలాంటి  ఐశ్వర్య రాజేశ్ కి ఈ ఏడాది ఆరంభంలోనే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో బ్లాక్ బస్టర్ పడింది. ఈ సినిమాలో ఆమె పాత్రకి కూడా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తరువాత ఐశ్వర్య రాజేశ్ ఇక్కడ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అలాంటి వాతావరణమేమీ కనిపించడం లేదు. కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుండటం ..  తమిళంలో బిజీగా ఉండటమే అందుకు కారణమా? లేదంటే సరైన కథలు రాకపోవడమా? అనేదే ఆమె అభిమానులకు అర్థం కావడం లేదు.



More Telugu News