'మిరాయ్' మూవీలోని హైలైట్స్ ఇవే!
- శుక్రవారం విడుదలైన 'మిరాయ్'
- తొలి ఆటతోనే దక్కిన హిట్ టాక్
- భారీ వసూళ్లతో దూసుకుపోతున్న సినిమా
- పిల్లలను సైతం ఆకట్టుకుంటున్న కంటెంట్
ప్రధానమైన పాత్రలు .. కథా కథనాలు .. అందుకు తగిన విజువల్స్ .. లొకేషన్స్ ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించాయి. ఒక సినిమాకి ఇంటర్వెల్ బ్యాంగ్ .. క్లైమాక్స్ చాలా ముఖ్యమైన అంశాలు. మిగతా కథ అంతా కూడా వీటిపైనే ఆధారపడి ఉంటుంది. అలాంటి ఆ రెండు కీలకమైన సన్నివేశాలను తెరపై ఆవిష్కరించడంతోనే ఈ సినిమా సక్సెస్ వైపు నడిచింది. అలాగే 'తంత్రవనం' .. 'అమరగ్రంథం' .. 'అంగమ్మబాలి' అనే పేర్లు మరింత బలంగా ప్రేక్షకులను కథలోకి లాగేస్తాయి.
ఈ సినిమాలో జటాయువు పక్షి సోదరుడైన 'సంపాతి' ఎపిసోడ్, పిల్లలను థియేటర్ కి రప్పించడంలో ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. గ్రాఫిక్స్ పరంగా ఈ ఎపిపోడ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా కనిపిస్తుంది. అలాగే 'మిరాయ్' ఆయుధంతో హీరో చేసే ఫస్టు ఫైట్, ఆ ఆయుధాన్ని ఉపయోగించి రన్నింగ్ ట్రైన్ ను నియంత్రించడం ప్రేక్షకులను అలా కూర్చోబెట్టేస్తుంది. ఇక 'అంగమ్మబాలి' ఎపిసోడ్ లో జగపతిబాబు లుక్ .. నటన, శ్రీరాముడి విల్లు కోదండమే 'మిరాయ్' అంటూ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ ఈ కథకి మరింత బలాన్ని చేకూర్చాయని చెప్పాలి.