టైమంతా బస్సులోనే గడిచిపోతోంది.. బెంగళూరు స్కూలు పిల్లల వీడియో
- స్కూలులో కన్నా బస్సులోనే ఎక్కువ సమయం గడుపుతున్నాం..
- రోడ్లు బాలేవు.. ట్రాఫిక్ లో గంటల తరబడి ప్రయాణం
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన బాలికల వీడియో
పిల్లలు మాట్లాడుతుండగానే బస్సు ఓ గుంతలో నుంచి వెళ్లడంతో ఫోన్ తలకిందులు కావడం వీడియోలో కనిపిస్తోంది. ఇది తమకు నిత్యకృత్యంగా మారిందని, తామేమీ అబద్ధం చెప్పడంలేదని ఆ పిల్లలు వివరించారు. స్కూలులో కన్నా బస్సులోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తోందని, దీనివల్ల ఆటలకు సమయమే మిగలడంలేదని చెప్పారు. ఆటల సంగతి వదిలేస్తే హోంవర్క్ చేసుకోవడానికి, చదువుకోవడానికీ టైముండడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రయాణం వల్ల శారీరకంగా అలసిపోవడంతో పాటు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నట్లు వారు వాపోయారు. కాగా, సాయంత్రం అప్ లోడ్ చేసిన ఈ వీడియోను రాత్రి పొద్దుపోయేలోపు ఏకంగా 8 లక్షల మందికి పైగా వీక్షించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు స్పందిస్తూ.. త్వరలో ఓటర్లుగా మారబోయే ఈ చిన్నారులు ఈరోజు తాము ఎదుర్కొంటున్న పరిస్థితులను గుర్తుంచుకుని బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని ఆశిస్తున్నట్లు ఓ యూజర్ కామెంట్ చేశారు. ఈ పిల్లల ఆత్మవిశ్వాసం, తమ సమస్యను ధైర్యంగా, స్పష్టంగా, మర్యాదపూర్వకంగా చెప్పిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.