Chandrababu Naidu: ఆటో డ్రైవర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ .. వాహన మిత్ర సాయం మార్గదర్శకాలు ఇవీ

Chandrababu Naidu Announces AP Vahana Mitra Guidelines
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆటో, క్యాబ్ డ్రైవర్లకు శుభవార్త తెలిపింది. అక్టోబర్ 1వ తేదీన పంపిణీ చేయనున్న వాహన మిత్ర సాయానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేయనుంది.

ఈ సహాయాన్ని డ్రైవర్లు బీమా, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, వాహన మరమ్మతులు, ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. సొంత వాహనాన్ని నడిపే డ్రైవర్లకు మాత్రమే ఈ సహాయం అందుతుంది.

అర్హత ప్రమాణాలు:

* దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనం కలిగి ఉండాలి.
* చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి.
* మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ యజమానులు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఆటో రిక్షా యజమానులకు తాత్కాలికంగా మినహాయింపు ఉంది, కానీ నెలలోపు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.
* దరఖాస్తుదారులు పేదరిక రేఖకు దిగువన ఉండాలి లేదా బీపీఎల్ రేషన్ కార్డు కలిగి ఉండాలి.
* దరఖాస్తుదారు లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు అయితే అనర్హులు. పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు వర్తిస్తుంది.
* నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించకూడదు. గత 12 నెలల సగటు ఆధారంగా లెక్కిస్తారు.
* వాహనంపై పెండింగ్ టాక్స్‌లు లేదా చలాన్లు ఉండకూడదు.
* వ్యవసాయ భూమి పరిమితి: మాగాణి అయితే 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు, లేదా రెండు కలిపి గరిష్టంగా 10 ఎకరాల లోపు ఉండాలి.
* పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస/వాణిజ్య నిర్మాణం ఉండకూడదు.

దరఖాస్తుల స్వీకరణ:

* ఈ నెల 17 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది.
* సెప్టెంబర్ 19 వరకు కొత్త దరఖాస్తులకు అవకాశం ఉంటుంది.
* సెప్టెంబర్ 22 నాటికి క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తి చేస్తారు.
* సెప్టెంబర్ 24 నాటికి తుది జాబితా సిద్ధం చేయబడుతుంది.
* అక్టోబర్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సహాయాన్ని జమ చేస్తారు.
* ఈ పథకానికి సంబంధించి గత సంవత్సరం లబ్ధిదారుల వివరాలను కూడా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పునఃసమీక్షించనున్నారు. దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేయడానికి జీఎస్‌డబ్ల్యూఎస్‌ విభాగం ప్రత్యేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను ఈ నెల 17 నాటికి సిద్ధం చేస్తుంది. 
Go Back to Shorts
Chandrababu Naidu
YSR Vahana Mitra
AP Vahana Mitra
Andhra Pradesh
Auto Drivers
Cab Drivers
Financial Assistance
Welfare Scheme
AP Government
Vehicle Maintenance

More Telugu News