Hetero Drugs: ఫ్యాన్సీ నెంబర్‌ను రూ. 25 లక్షలకు కొనుగోలు చేసిన హెటెరో డ్రగ్స్ యజమాని.. రవాణాశాఖకు కాసుల పంట

Hetero Drugs Owner Buys Fancy Number for Rs 25 Lakhs
  • ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి రూ. 63 లక్షలకు పైగా ఆదాయం
  • ఫ్యాన్సీ నెంబర్ల ద్వారా సమకూరిన రూ. 63,77,361 ఆదాయం
  • రూ. 25,50,200లకు 'టీజీ 09 జీ 9999' నెంబర్‌కు దక్కించుకున్న హెటెరో డ్రగ్స్
ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా ఈరోజు ఒక్కరోజే రూ.63 లక్షల ఆదాయం లభించింది. ఈ వేలంతో తెలంగాణ రవాణా శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. ఫ్యాన్సీ నెంబర్లను దక్కించుకునేందుకు పలువురు ప్రముఖులు పోటీపడ్డారు. ఈ వేలం ద్వారా రవాణా శాఖకు అక్షరాలా రూ. 63,77,361 ఆదాయం వచ్చింది.

'టీజీ 09 జీ 9999' నెంబర్‌‌ను హెటెరో డ్రగ్స్ యజమాని అత్యధికంగా రూ. 25,50,200 చెల్లించి సొంతం చేసుకున్నారు. 'టీజీ 09 హెచ్ 0009' నెంబర్‌ను ఏఆర్ఎల్ టైర్స్ లిమిటెడ్ యాజమాన్యం రూ. 6,50,009లకు, 'టీజీ 09 హెచ్ 0001' నెంబర్‌ను డాక్టర్ రాజేశ్వరీస్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం రూ. 6,25,999లకు, 'టీజీ 09 హెచ్ 0006' నెంబర్‌ను ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ యాజమాన్యం రూ. 5,11,666లకు, 'టీజీ 09 హెచ్ 0005'ని వెంకటేశ్వరరావు శృంగవరపు రూ. 2,22,000లకు దక్కించుకున్నారు.
Hetero Drugs
Hetero Drugs owner
fancy number
Telangana transport department
Khairatabad RTA

More Telugu News