Medak district: రెండేళ్ల కుమార్తెను చంపి ప్రియుడితో పారిపోయిన వివాహిత

Mamatha Kills Daughter Elopes With Lover in Medak
  • మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో దారుణం
  • మే 27 నుంచి కుమార్తెతో సహా కనిపించకుండా పోయిన వివాహిత
  • భర్త ఫిర్యాదుతో అదృశ్యం కేసు నమోదు
  • గుంటూరులో వివాహిత, ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శివ్వంపేట మండలం శభాశ్‌పల్లిలో వివాహిత, తన రెండేళ్ల కుమార్తెను హతమార్చి ప్రియుడితో పరారైంది. ఈ ఏడాది మే 27 నుంచి మమత అనే వివాహిత, తన కుమార్తెతో సహా కనిపించకుండా పోయింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసులు, మమతను మరియు ఆమె ప్రియుడు ఫయాజ్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో గుర్తించారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా, ప్రియుడితో కలిసి కుమార్తెను హత్య చేసి పాతిపెట్టినట్లు ఒప్పుకున్నారు. నిందితులను గ్రామానికి తీసుకువచ్చి, వారు చూపించిన స్థలంలో తవ్వి చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తూప్రాన్ పోలీసులు తెలిపారు.
Medak district
Telangana crime
Child murder
Guntur
Crime news Telangana

More Telugu News