తెలంగాణలో పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు

  • శుక్ర, శనివారాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడి
  • మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ
  • గాలులు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడి
తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో పలు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఈ రోజు ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. శనివారం నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.


More Telugu News