Mirai Movie: తెరపై అద్భుతాలు చేసే 'మిరాయ్'

Mirai Movie Update
  • తేజ సజ్జ హీరోగా చేసిన 'మిరాయ్'
  • ప్రతినాయకుడిగా మంచు మనోజ్ 
  • విజువల్స్ పరంగా మార్కులు కొట్టేస్తున్న కంటెంట్
  • పాన్ ఇండియా స్థాయిలో రేపు రిలీజ్

ఈ మధ్య కాలంలో ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడమనేది ఒక ప్రధానమైన టాస్క్ గా మారింది. థియేటర్స్ కి ఆడియన్స్ రావాలంటే .. రావాలని వాళ్లకి అనిపించాలంటే, ఆ సినిమాలో కొత్తగా ఏదో విషయం ఉండాలి. ఈ సినిమాను థియేటర్ లో చూస్తేనే బాగుంటుందనే నమ్మకం కలగాలి. అద్భుతమైన విజువల్స్ తెరపై పండుగ చేస్తాయని అనిపించాలి. అప్పుడే థియేటర్స్ కి జనాలు వస్తున్నారు. అలాంటి ఒక బలమైన నమ్మకాన్ని కలిగించిన సినిమాగా 'మిరాయ్' కనిపిస్తోంది. 

'మిరాయ్' .. అర్థమేదైనా సౌండింగ్ తో ఈ టైటిల్ కనెక్ట్ అయింది. పోస్టర్లు .. ట్రైలర్ మరింత బజ్ ను క్రియేట్ చేస్తూ వెళ్లాయి. 'హనుమాన్' సినిమాతో తేజ సజ్జ సంపాదించుకున్న క్రేజ్ .. విశ్వప్రసాద్ వంటి నిర్మాత ఈ సినిమాను నిర్మించడం .. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటం .. సోషియో ఫాంటసీని టచ్ చేయడం .. విజువల్స్ పరంగా అద్భుతాలు చేయనుండటం .. ఈ సినిమాపై అంచనాలు పెంచుతూ వెళ్లాయి. ఇక మంచు మనోజ్ విలనిజం అదనపు బలంగా మారనుంది. రేపే ఈ సినిమా థియటర్లలో దిగనుంది. 

ఈ కథపై నిర్మాత విశ్వప్రసాద్ బలమైన నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే క్రితం ఏడాది తాను నిర్మించిన మూడు సినిమాలు భారీ నష్టాలను తెచ్చిపెట్టాయని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయినా ఆయన వెనకడుగు వేయకుండా చేసిన సాహసం ఇది. ఆయన లాంటి ఒక నిర్మాత ఇండస్ట్రీకి చాలా అవసరమనే అభిప్రాయాలు వినిపించాయి. మరి భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా, ఆయనను నష్టాల భారీ నుంచి బయటపడేస్తుందేమో చూడాలి.

Mirai Movie
Mirai
Teja Sajja
Vishnu Manchu
Viswa Prasad
Hanuman Movie
Telugu Movie
Pan India Movie
Socio Fantasy Movie
Telugu Cinema

More Telugu News