కవితకు చింతమడక వాసుల ఆహ్వానం.. ఎందుకంటే?

  • బతుకమ్మ వేడుకల్లో తమతో కలిసి పాల్గొనాలని కోరిన గ్రామస్తులు
  • ఈ నెల 21న జరిగే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని విజ్ఞప్తి
  • పెద్ద ఎత్తున తరలి వచ్చిన గ్రామస్తులు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఆమె తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత గ్రామమైన చింతమడక నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకల్లో తమతో కలిసి పాల్గొనాలని గ్రామస్తులు ఆమెను కోరారు.

ఈ నెల 21వ తేదీన జరిగే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ చింతమడక గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో గురువారం హైదరాబాద్‌లోని కవిత నివాసానికి తరలివచ్చారు. తమ గ్రామ ఆడపడుచుగా భావించి, పండుగకు తప్పకుండా రావాలని వారు కవితను ఆత్మీయంగా ఆహ్వానించారు.


More Telugu News