Bellamkonda Sreenivas: 'కిష్కిందపురి' ప్రీమియర్ షో టాక్!

Kishkindapuri Movie Update
  • బెల్లంకొండ హీరోగా 'కిష్కిందపురి'
  • రేపు విడుదలవుతున్న సినిమా 
  • దెయ్యం పాత్రలో అనుపమా పరమేశ్వరన్ 
  • హారర్ ఎలిమెంట్స్ హైలైట్ అంటూ టాక్

బెల్లంకొండ శ్రీనివాస్ కి మాస్ ఆడియన్స్ లో క్రేజ్ ఉంది. మధ్యలో బాలీవుడ్ వైపు వెళ్లడం వలన ప్లానింగ్ దెబ్బతిందిగానీ, లేదంటే వరుస సినిమాలు వదిలేవాడే. టాలీవుడ్ లో మంచి హైటూ .. వెయిటూ ఉన్న హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా కనిపిస్తాడు. ఆ మధ్య వచ్చిన 'భైరవం' సినిమాలో ముగ్గురు హీరోల్లో ఒకరుగా కనిపించాడు. కొత్తగా ట్రై చేశాడుగానీ, ప్రయోజనం దక్కలేదు. ఆ తరువాత సినిమాగా ఆయన చేసినదే 'కిష్కిందపురి'.

సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకి కౌశిక్ దర్శకత్వం వహించాడు. టైటిల్ తోనే ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. పోస్టర్స్ కూడా అంచనాలు పెంచుతూ వచ్చాయి. అందరిలో కుతూహలం పెరగడంలో అనుపమా పరమేశ్వరన్ లుక్ కీలకమైన పాత్రను పోషించిందని చెప్పాలి. అలాంటి ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినీ క్రిటిక్స్ కోసం ఈ సినిమా ప్రీమియర్ షో వేశారు. ఈ సినిమా చూసినవాళ్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. 

దర్శకుడు తాను చెప్పదలచుకున్న విషయాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా .. క్లారిటీతో చెప్పాడని అంటున్నారు. బెల్లంకొండ - అనుపమ పాత్రలను డిజైన్ చేసిన తీరు, హారర్ ఎలిమెంట్స్ ను ఆవిష్కరించిన విధానం హైలైట్ గా నిలిచాయని చెబుతున్నారు. దెయ్యం ఆవహించిన పాత్రలో అనుపమ మరిన్ని మార్కులు కొట్టేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫస్టాఫ్ కి మించి సెకండాఫ్ థ్రిల్ చేసిందనీ, ఈ సినిమాతో బెల్లంకొండకి హిట్ పడటం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. చూడాలిమరి .. రేపు థియేటర్స్ లో ఆడియన్స్ ఏమంటారో! 
Bellamkonda Sreenivas
Kishkindapuri
Anupama Parameswaran
Telugu movie review
horror thriller
Kaushik
Sahu Garapati
Tollywood
new release
movie talk

More Telugu News