రసాయన ఆయుధాలతో ఐసిస్ ఉగ్రకుట్ర భగ్నం.. తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో అరెస్టులు
- వివిధ రాష్ట్రాల్లో ఐసిస్ స్లీపర్ సెల్ గుట్టురట్టు
- రసాయన ఆయుధాల తయారీలో నిపుణులైన ఐదుగురు అరెస్ట్
- అరెస్టయిన వారిలో తెలంగాణ వ్యక్తి కూడా
- పాకిస్థాన్ నుంచి హ్యాండ్లర్ల ఆదేశాలు
- 'ఖిలాఫత్' మోడల్‌తో యువతను ఆకర్షిస్తున్న ముఠా
దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ఐసిస్ ఉగ్రవాద సంస్థ పన్నిన భారీ కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. రసాయన ఆయుధాల తయారీలో నైపుణ్యం కలిగిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశాయి. తెలంగాణ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఈ స్లీపర్ సెల్ గుట్టు రట్టయింది. ఈ ముఠా పాకిస్థాన్ లోని తమ హ్యాండ్లర్ల నుంచి ఆదేశాలు అందుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు.
అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఉగ్రవాద ముఠా 'ఖిలాఫత్' నమూనాను అనుసరిస్తోంది. ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకుని, అక్కడి నుంచి జిహాద్ కార్యకలాపాలు సాగించడమే ఈ మోడల్ ఉద్దేశం. యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడం, బాంబులు తయారుచేయడం, ఆయుధాలు సమకూర్చుకోవడం వంటి పనులను ఈ ముఠా సభ్యులు చూసుకుంటున్నారని తెలిసింది.
అరెస్టయిన వారిలో ఇద్దరిని ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి చెందిన అఫ్తాబ్, అబు సుఫియాన్‌గా వీరిని గుర్తించారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో కమ్రాన్ ఖురేషిని, తెలంగాణలో హుజైఫ్ యెమెన్‌ను అరెస్ట్ చేశారు. ఈ ముఠా నాయకుడిగా భావిస్తున్న అషార్ డానిష్‌ను ఝార్ఖండ్‌లోని రాంచీలో పట్టుకున్నారు. ఇంగ్లీష్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన డానిష్... 'గజ్వా' అనే కోడ్ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో రాంచీకి వచ్చిన అతను, ఒక లాడ్జిలో విద్యార్థి ముసుగులో తలదాచుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
అనుమానితుల నుంచి భారీ ఎత్తున రసాయనాలు, ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, సల్ఫర్ పౌడర్ వంటి ప్రమాదకర రసాయనాలతో పాటు ఒక పిస్టల్, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, బేరింగులు, డిజిటల్ పరికరాలు వారి వద్ద లభించాయి. డానిష్‌కు రసాయన ఆయుధాల తయారీలో ప్రత్యేక నైపుణ్యం ఉందని, వీరంతా ఏదో ఒక భారీ దాడికి ప్రణాళిక రచించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్ లోని హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.