Yakutpura: యాకుత్ పురాలో మ్యాన్ హోల్ లో పడిపోయిన బాలిక.. వెంటనే స్పందించిన తల్లి.. వీడియో ఇదిగో!

Hyderabad Girl Saved After Falling Into Open Manhole in Yakutpura
––
స్కూలుకు వెళుతున్న ఓ బాలిక ప్రమాదవశాత్తూ మ్యాన్ హోల్ లో పడిపోయిన ఘటన హైదరాబాద్ లోని యాకుత్ పురాలో చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాల యూనిఫాం వేసుకున్న ఆరేళ్ల బాలిక రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతోంది. తెరిచి ఉంచిన మ్యాన్ హోల్ ను చూడకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయగా.. మ్యాన్ హోల్ పై ఉంచే సిమెంట్ దిమ్మ కాలికి తగిలి అందులో పడిపోయింది. ఆ బాలిక వెనకే కూతురుతో కలిసి వస్తున్న మహిళ ఈ దృశ్యం చూసి వేగంగా స్పందించింది.

పరుగున మ్యాన్ హోల్ దగ్గరికి చేరుకుని బాలికను పైకి లాగింది. దీంతో బాలికకు ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన మొత్తం అక్కడికి సమీపంలోని ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, రోడ్డుపై మ్యాన్ హోల్ మూత తెరిచి ఉంచిన మున్సిపల్ సిబ్బందిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా పాప ప్రాణాలు పోయేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Yakutpura
Hyderabad
Manhole accident
Girl falls in manhole
Viral video
Municipal negligence
Road safety
CCTV footage
Telangana news
Accident

More Telugu News