Nara Lokesh: వైసీపీ కోరలు పీకేసినా... ఆ పాము విషం చిమ్ముతూనే ఉంది: నారా లోకేశ్

Nara Lokesh slams YSRCP for fake video propaganda
  • సీఎం చంద్రబాబు మాటలను వక్రీకరించారని లోకేశ్ మండిపాటు
  • ఫేక్ వీడియోలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శ
  • యూరియా, పథకాలపై కూడా నకిలీ ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్య
వైసీపీ ఫేక్ వీడియోలతో విష ప్రచారానికి పాల్పడుతోందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను హెచ్చరించినట్టుగా ఆయన మాటలనే వక్రీకరించి ఒక నకిలీ వీడియోను సృష్టించారని మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి మీడియా ముఖంగా మాట్లాడిన మాటలనే ఎడిట్ చేసి దుష్ప్రచారం చేయడం వైసీపీ నేతల తీరుకు నిదర్శనమని అన్నారు.

కేవలం ముఖ్యమంత్రి ప్రసంగం విషయంలోనే కాకుండా యూరియా, ప్రభుత్వ పథకాలు వంటి పలు అంశాలపై కూడా వైసీపీ క్రిమినల్స్ ఫేక్ ప్రచారాలు, నకిలీ ఆందోళనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైసీపీ అనే విష సర్పం కోరలు పీకేశారని, అయినా ఆ పార్టీ తన బుద్ధి మార్చుకోకుండా ప్రతిక్షణం విషం కక్కుతూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోరలు పీకేసిన పాము కూడా కాటేయాలని చూస్తుందనే విధంగా వైసీపీ ప్రవర్తన ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇలాంటి తప్పుడు ప్రచారాలు, ఫేక్ వీడియోల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వాస్తవాలను నిర్ధారించుకోవాలని మంత్రి లోకేశ్ సూచించారు. 

Nara Lokesh
YSRCP
fake videos
Chandrababu Naidu
Andhra Pradesh politics
TDP
political propaganda
social media
fake news
AP government

More Telugu News