MS Dhoni: ధోనీ క్రేజ్ మామూలుగా లేదుగా.. రోల్స్ రాయిస్ కారు వీడియో వైరల్

MS Dhoni Rolls Royce Car Video Goes Viral
  • రాంచీలోని ఇంటి నుంచి రోల్స్ రాయిస్ కారులో బయటకు వ‌చ్చిన మ‌హీ
  • ఆ దృశ్యాల‌ను కెమెరాల్లో బంధించి నెట్టింట పోస్ట్‌ చేసిన‌ అభిమానులు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ధోనీ వీడియో
టీమిండియా మాజీ కెప్టెన్, 'కెప్టెన్ కూల్' మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా చాలా సింపుల్‌గా కనిపించే ధోనీ, తన లగ్జరీ కార్ల కలెక్షన్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు. రాంచీలోని తన నివాసం నుంచి ఖరీదైన రోల్స్ రాయిస్ కారులో ఆయన బయటకు వస్తున్న దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

రాంచీలోని సిమ్లియాలో ఉన్న ధోనీ ఇంటి గేటు తెరుచుకోగానే, లోపలి నుంచి మెరిసిపోతున్న రోల్స్ రాయిస్ కారు నెమ్మదిగా బయటకు వచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న అభిమానులు ఈ అరుదైన దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది.

కాగా, ఈ వీడియో మూడు రోజుల క్రితం నాటిదని తెలుస్తోంది. అయితే, తాజాగా ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమవ్వడంతో ధోనీ అభిమానులు దీన్ని తెగ‌ షేర్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.

ధోనీకి కార్లు, బైక్‌లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన గ్యారేజీలో అనేక రకాల సూపర్ బైక్‌లు, విలాసవంతమైన కార్లు ఉన్నాయి. తాజాగా బయటకొచ్చిన ఈ రోల్స్ రాయిస్ కారు వీడియో, ఆయన వాహనాలపై ఉన్న మక్కువను మరోసారి చాటి చెబుతోంది. 
MS Dhoni
Dhoni
MS Dhoni Rolls Royce
Rolls Royce
Dhoni car collection
Ranchi
Similia
Dhoni viral video
Indian Cricket
Captain Cool

More Telugu News