బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీని ప్రకటించిన అధిష్ఠానం

  • ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, 8 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులతో కమిటీ ఏర్పాటు
  • రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా గౌతంరావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్
  • ఉపాధ్యక్షులుగా బూర నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు
బీజేపీ అధిష్ఠానం తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీని ప్రకటించింది. ఈ కమిటీలో ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఎనిమిది మంది రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉంటారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా గౌతంరావు, తూళ్ల వీరేందర్ గౌడ్, వేముల అశోక్‌లను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు.

రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బూర నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, బండారి శాంతి కుమార్, కొల్లి మాధవి, జయశ్రీ, బండా కార్తీక్ రెడ్డి, రఘునాథ్ రావు, కల్యాణ్ నాయక్‌లను నియమించినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, వివిధ మోర్చాలకు రాష్ట్ర అధ్యక్షులను కూడా నియమించారు.


More Telugu News