Roja: ఒక మూగ బాలిక‌ను ర‌క్షించ‌లేకపోయింది ఈ ప్ర‌భుత్వం!: రోజా

Roja criticizes government failure to protect mute girl
  • విశాఖ సీతమ్మధారలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం
  • మతిస్థిమితం లేని మూగ బాలికపై ఇద్దరు బాలుర అఘాయిత్యం
  • తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఘటనపై తీవ్రంగా స్పందించిన వైసీపీ నేత రోజా
  • ఇది రాక్షస ప్రభుత్వమా అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
విశాఖపట్నంలో మతిస్థిమితం లేని 13 ఏళ్ల మూగ బాలికపై ఇద్దరు బాలురు అత్యాచారం చేయడం తీవ్ర కలకలం రేపింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై వైసీపీ మహిళా నేత రోజా తీవ్రంగా స్పందించారు. 

"ఒక మూగ బాలిక‌ను కూడా ర‌క్షించ‌లేని ఈ ప్ర‌భుత్వం ఉన్నా ఒక‌టే లేక‌పోయినా ఒక‌టే. ఇది మంచి ప్ర‌భుత్వ‌మా? రాక్ష‌స ప్ర‌భుత్వ‌మా చంద్రబాబు గారూ? విశాఖ‌ప‌ట్నం సీత‌మ్మ‌ధార‌లో మూగ బాలిక‌పై ఇద్ద‌రు అత్యాచారానికి పాల్ప‌డడం మీ అస‌మ‌ర్థ పాల‌న‌కు నిద‌ర్శం కాదా?" అంటూ రోజా తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 
Roja
Roja Selvamani
Visakhapatnam
Andhra Pradesh
Minor girl rape
YS Jagan Mohan Reddy government
Chandrababu Naidu
AP Politics
Crime news Andhra Pradesh
Seethammadhara

More Telugu News