Bharani Shankar: నా వలన మా అమ్మ చాలా బాధపడింది: నటుడు భరణి శంకర్

Bharani Shankar Interview
  • 'చి.ల. సౌ. స్రవంతి' పేరు తెచ్చింది
  • మంచి పేరు .. డబ్బు వచ్చాయి 
  • నేను నష్టపోవడానికి కారణాలివే 
  • అమ్మను సంతోషపెట్టాలని ఉందన్న భరణి శంకర్  
బుల్లితెర ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో భరణి శంకర్ ఒకరు. ఎక్కువగా నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలను చేస్తూ వెళ్లిన భరణి శంకర్, ఆ తరువాత వెండితెరపై కూడా కనిపించారు. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన గురించిన అనేక విషయాలను పంచుకున్నారు." ఒక ఫ్రెష్ ఫేస్ కోసం బుల్లితెరవాళ్లు వెదుకుతున్న సమయంలో నేను రావడం నాకు కలిసొచ్చింది. 'చి.ల. సౌ. స్రవంతి' సీరియల్ ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది" అని అన్నారు.  

" వరుస అవకాశాలు .. పేరు .. డబ్బు వచ్చాయి. ఆ సమయంలో కొన్ని వ్యసనాల కారణంగా వచ్చిన డబ్బును వచ్చినట్టుగా ఖర్చు చేశాను. ఎవరైనా చెడిపోతే అందుకు కారణం స్నేహతులేనని చెబుతూ ఉంటారు. నేను అలా ఎవరినీ బాధ్యులను చేయను. కిందపడినా .. పైకి లేచినా .. అందుకు ఎవరికి వారే కారణమని చెబుతాను. నా ఆలోచనా విధానం సరిగ్గా లేకపోవడం వల్లనే నేను నష్టపోయాను. నిర్మాతగానూ చేసి దెబ్బతిన్నాను" అని చెప్పారు. 

" ఎవరైనా సరే తెలిసిన పని చేయాలి. తెలియని ప్లేస్ కి వెళ్లి యుద్ధం చేయకూడదు. నటుడిగా ఎదగాలనే ప్రయత్నం చేయకుండా, నిర్మాణం వైపు వెళ్లడమే నేను చేసిన తప్పు. అందువలన అయిన అప్పులు తీర్చడానికి మా అమ్మ తన బంగారం కూడా తాకట్టు పెట్టింది. నా కారణంగా అమ్మ చాలా బాధ పడింది. ఇప్పుడు నేను మారిపోయాను .. నేను ఏమిటనేది తెలుసుకున్నాను. మా అమ్మను సంతోష పెట్టాలనే ఆలోచన తప్ప నాకు మరో ధ్యాసలేదు" అని అన్నారు. 

కాగా, భరణి నిన్న ప్రారంభమైన తెలుగు బిగ్ బాస్ సీజన్-9లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంటరైన సంగతి తెలిసిందే. 
Bharani Shankar
Actor

More Telugu News