Nara Lokesh: కోయంబత్తూరు పర్యటనపై మంత్రి నారా లోకేశ్ స్పందన
- కోయంబత్తూరు పారిశ్రామికవేత్తలతో సమావేశమైన మంత్రి నారా లోకేశ్
- ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించిన లోకేశ్
- పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులు, స్నేహపూర్వక విధానాలు
- సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ లాజిస్టిక్ హబ్‌గా అభివృద్ధి
- ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ వ్యాపారవేత్తలకు పిలుపు
ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ కోయంబత్తూరు పర్యటనపై సోషల్ మీడియాలో స్పందించారు. కోయంబత్తూరు విమానాశ్రయంలో తనకు తమిళనాడు బీజేపీ నేత అమర్ ప్రసాద్ రెడ్డి, స్థానిక తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారని, వారి ఆత్మీయత ఎంతో ఆనందాన్ని కలిగించిందని లోకేశ్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
"కోయంబత్తూరులోని పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలను వివరించాను. ప్రస్తుతం ఏపీలో పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను అమలు చేస్తున్నాం. పరిశ్రమదారులు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టుతో రాష్ట్రానికి వచ్చాక నిర్మాణం పూర్తయ్యే వరకు పూర్తి బాధ్యత మాదే. రాష్ట్రంలో పెద్దఎత్తున వాయు, జల, రోడ్డు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రపదేశ్ లాజిస్టిక్ హబ్ గా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న పరిశ్రమ అనుకూల విధానాల వల్ల జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. పరిశ్రమలకు గమ్యస్థానంగా మారిన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పిలుపునిచ్చాను" అని లోకేశ్ వివరించారు.