‘బిగ్‌బాస్‌ 9’ లాంచ్‌ ప్రోమో.. వీడియో ఇదిగో!

––
బిగ్ బాస్.. బుల్లితెర ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో తాజాగా మరింత వైవిధ్యంగా ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ 9వ సీజన్ ప్రారంభం కానుండగా.. తాజాగా బిగ్ బాస్ టీమ్ షో లాంచ్ ప్రోమోను విడుదల చేసింది. ఈ వీడియోలో పలువురు సెలబ్రిటీ కంటెస్టెంట్‌ వాయిస్‌ మాత్రమే వినిపించింది.

ఓ కంటెస్టెంట్‌ హౌస్‌లోకి గిఫ్ట్‌ తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా బిగ్‌బాస్‌ తిరస్కరిస్తాడు. దీంతో, ‘నువ్వు ఇంటికెళ్లిపోవచ్చు’ అని నాగార్జున చెబుతారు. గత సీజన్లకు ఇది ఎంత వైవిధ్యంగా ఉండబోతోందో ప్రోమో చూస్తే అర్థమవుతోంది.


More Telugu News