Sai Pallavi: దుబాయ్‌లో సైమా 2025 సందడి... ఉత్తమ నటిగా సాయి పల్లవి!

Sai Pallavi wins Best Actress at SIIMA 2025 Dubai
  • దుబాయ్‌లో ఘనంగా జరిగిన సైమా 2025 అవార్డుల ప్రదానోత్సవం
  • తమిళం నుంచి ఉత్తమ చిత్రంగా నిలిచిన 'అమరన్'
  •  'అమరన్' చిత్రానికే ఉత్తమ నటిగా సాయి పల్లవి ఎంపిక
  • మలయాళంలో ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ ('ది గోట్ లైఫ్')
  • సీనియర్ నటుడు శివకుమార్, నటి త్రిషకు ప్రత్యేక పురస్కారాలు
  • మలయాళంలో 'మంజుమ్మల్ బాయ్స్' ఉత్తమ చిత్రంగా అవార్డు
ప్రతిష్ఠాత్మక 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్' (సైమా) 2025 వేడుకలు దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ తారల తళుకుబెళుకుల మధ్య ఈ కార్యక్రమం కనులపండువగా సాగింది. 13వ ఎడిషన్ సైమా అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా శనివారం రాత్రి తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన విజేతలను ప్రకటించారు.

తమిళ చిత్రసీమలో 'అమరన్' చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇదే సినిమాలో కనబరిచిన అద్భుత నటనకుగానూ ప్రముఖ నటి సాయి పల్లవి ఉత్తమ నటి అవార్డును కైవసం చేసుకున్నారు. ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇక మలయాళ చిత్ర పరిశ్రమలో 'మంజుమ్మల్ బాయ్స్' ఉత్తమ చిత్రంగా పురస్కారం గెలుచుకుంది. 'ది గోట్ లైఫ్' చిత్రానికి గాను స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.

ఈ వేడుకల్లో భాగంగా సినీ పరిశ్రమకు దశాబ్దాలుగా సేవలందిస్తున్న వారికి ప్రత్యేక పురస్కారాలతో సత్కరించారు. సీనియర్ నటుడు శివకుమార్‌తో పాటు, సుదీర్ఘకాలంగా కథానాయికగా రాణిస్తున్న త్రిషకు ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. కాగా, తెలుగు విభాగంలో 'పుష్ప 2', 'కల్కి' చిత్రాలు అత్యధిక అవార్డులు గెలుచుకున్న సంగతి తెలిసిందే.
Sai Pallavi
SIIMA 2025
South Indian International Movie Awards
Dubai
Amaraan
Manjummel Boys
Prithviraj Sukumaran
Trisha
Pushpa 2
Kalki

More Telugu News