Ponguru Narayana: టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్

Ponguru Narayana Announces Good News for TIDCO House Beneficiaries
  • వచ్చే ఏడాది మార్చి నాటికి 163 టిడ్కో గృహ సముదాయాలు అందుబాటులోకి వస్తాయన్న మంత్రి నారాయణ
  • కర్నూలు శివారులోని జగన్నాథగట్టు వద్ద టిడ్కో గృహ నిర్మాణాలు పరిశీలించిన మంత్రి నారాయణ
  • మౌలిక సదుపాయాలతో పాటు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి వసతులు ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి నారాయణ
ఆంధ్రప్రదేశ్ టిడ్కో గృహ లబ్ధిదారులకు మంత్రి పొంగూరు నారాయణ శుభవార్త తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 163 టిడ్కో గృహ సముదాయాలను వచ్చే ఏడాది మార్చి 31 నాటికి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. కర్నూలు శివారులోని జగన్నాథగట్టు వద్ద టిడ్కో గృహ నిర్మాణాలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, టిడ్కో గృహ సముదాయాల వద్ద మౌలిక సదుపాయాలతో పాటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి వసతులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజల నివాస అవసరాలతో పాటు సమగ్ర జీవన ప్రమాణాలు కల్పించేందుకే ఈ ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు.

కర్నూలు టిడ్కో గృహాలపై ప్రత్యేక దృష్టి:

జగన్నాథగట్టు ప్రాంతంలో నిర్మిస్తున్న 3,056 గృహాలను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ఇక్కడ రూ.1 కోటి వ్యయంతో తాగునీటి వసతి, అదనంగా రూ.5 కోట్లు మౌలిక సదుపాయాల కోసం మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.

పదెకరాల స్థలాన్ని పరిశ్రమల కోసం కేటాయించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా స్థానిక ఉపాధికి దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు టీజీ భరత్, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. 
Ponguru Narayana
TIDCO houses
Andhra Pradesh
housing scheme
Kurnool
Jaganannagattu
TG Bharat
Gowru Charitha Reddy
Boggula Dastagiri

More Telugu News