Kavitha: కవిత ఓ కొరివి దెయ్యం: మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు

Kavitha a Korivi Deyyam Says Minister Jupally Krishna Rao
  • కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నారని గతంలో కవితే చెప్పారన్న జూపల్లి
  • ఆ దెయ్యాల్లో కవిత కూడా ఒకరని ఎద్దేవా
  • బీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యాన్ని పాతరేశారని విమర్శ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమెను ఓ 'కొరివి దెయ్యం' అంటూ అభివర్ణిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ దెయ్యాలు చేరాయని కవితే అన్నారని గుర్తుచేస్తూ, ఆ దెయ్యాల్లో ఆమె కూడా ఒకరని ఆరోపించారు.

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అధ్యక్షతన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరితో పాటు జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జూపల్లి, కవితను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని స్వయంగా కవితే చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. "నేను మంత్రి పదవి ఆశించి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లలేదు. కానీ ఆ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా పాతరవేసింది" అని జూపల్లి విమర్శించారు. కవిత ఇప్పుడు కొన్ని విషయాలు దాచిపెడుతూ, మరికొన్ని మూసిపెడుతూ మాట్లాడుతున్నారని, పూర్తి నిజాలు బయటపెట్టడం లేదని ఆయన ఆరోపించారు. 
Kavitha
BRS MLC Kavitha
Minister Jupally Krishna Rao
Jupally Krishna Rao
Telangana Politics
Corruption Allegations
Double Bedroom Houses
Jogulamba Gadwal
KCR
BRS Government

More Telugu News